Tuesday, May 26, 2020
Home News ఒడిశాకు 500 కోట్ల ఆర్ధిక సహాయం పీఎం మోది

ఒడిశాకు 500 కోట్ల ఆర్ధిక సహాయం పీఎం మోది

అమ్ఫాన్ తుఫాను వలన నష్టపోయిన ఒడిశా రాష్ట్రాలకి ప్రధాన మంత్రి నరేంద్ర మోది శుక్రవారం 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ‘అమ్ఫాన్’ తుఫాను దెబ్బతిన్న ప్రాంతాలపై వైమానిక సర్వే తర్వాత మోడీ ఈ ప్రకటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణాత్మక నివేదిక వచ్చిన తరువాత దీర్ఘకాలిక పునరావాస చర్యలకు మరింత సహాయం అందిస్తామని ప్రధాని చెప్పారు. ముందస్తుగా సన్నాహాలు చేయడం ద్వారా ఒడిశా ప్రభుత్వం ప్రాణాలను కాపాడుకోగలిగినప్పటికీ, తుఫాను పశ్చిమ బెంగాల్ లో తీరం దాటుతూ వ్యవసాయ రంగానికి, గృహ, విద్యుత్, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం కలిగించిందని మోడీ అన్నారు. ప్రతి ఒక్కరూ COVID-19 పై యుద్ధంలో నిమగ్నమై ఉన్న సమయంలో, ఈ విపత్తు రాష్ట్రానికి తీవ్రమైన సవాలు విసిరిందని ఒడిశా ముఖ్య మంత్రితో మోదీ అన్నారు.

Most Popular

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...

అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారితో పోరాడుతున్న మహారాష్ట్ర కు మరో చేదు వార్త.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అశోక్ చవాన్ కు కరోనా వైరస్ పరీక్షలు జరుపగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇతను...

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు… "ఈద్ ముబారక్"పవిత్ర రంజాన్ నెల ముగిసిన తరువాత రోజు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)...

లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్డౌన్ చేయడం వలన 14-20 లక్షల కరోనా కేసుల్ని, 37000 నంచి 78000 మరణాలను అరికట్ట వచ్చు అని ఓక ప్రభుత్వ అధ్యయనం లో తెలిసింది. అయితే 54,000 మరణాలు,...