Thursday, September 24, 2020
Home World News నేపాల్ చర్యలను అంగీకరించం అన్న భారత్

నేపాల్ చర్యలను అంగీకరించం అన్న భారత్

ఈ నెల 11 న భారత రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తరాఖండ్‌ మీదుగా లిపులేఖ్‌ వరకూ మానస సరోవర్‌ యాత్రకెళ్లేవారి సౌకర్యార్థం నిర్మించిన రహదారికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన నాటి నుంచి లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య నెలకొన్న వివాదం ఇంకా ముదిరింది. ఈ మూడు ప్రాంతాలను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్‌ చేస్తూ అందుకు సంబంధించిన తీర్మానాన్ని నేపాల్‌ అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ భూభాగాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. కాగా నేపాల్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్‌ ఆ దేశం నిర్ణయాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. నేపాల్‌ రూపొందించిన మ్యాప్‌కు చారిత్రక ఆధారాలు లేవని కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులు చెల్లవని స్పష్టం చేసింది.
ఈ విషయం గురించి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ నేపాల్‌ ప్రభుత్వ ఏకపక్ష చర్యను అంగీకరించబోమన్నారు. ‘‘ఈ విషయంలో భారత్‌ వైఖరి ఏమిటో నేపాల్‌కు స్సష్టమైన అవగాహన ఉంది. ఇకనైనా ఇలాంటి చర్యలకు పాల్పడడం మను కోవాలని పేర్కొన్నారు.

Most Popular

చైనా సరిహద్దు నిఘాకి ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోని అత్యంత చురుకైన, నిఘా డ్రోన్ను అందించిన DRDO.

భారతదేశం మరియు చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం మధ్య, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఎత్తైన ప్రదేశాలు మరియు పర్వత భూభాగాలపై...

కరోనా ప్రభావం: కోవిడ్ సేఫ్ దేశాలలో ఫ్యూచర్స్ ప్లాన్ చేస్తున్న ప్రపంచం బిలియనీర్స్…

లాక్డౌన్ తర్వాత ప్రపంచ ధనవంతులు చేయబడినప్పుడు, వారు తమ రిమోట్ మరియు ఎండ బీచ్కు తప్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలనుకొంటున్నారు. లేదా బహుశా న్యూజిలాండ్ లో కోవిడ్ -19 ను తొలగించిన కొద్ది...

‘AP పీపుల్ ఆమోదం పొందిన జగన్ 3 రాజధానులు’

ఎపిలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులపై నిందలు వేస్తూ సిఆర్డిఎను రద్దు చేస్తున్నాయి. గత శనివారం ఈ బిల్లులను ఎపి గవర్నర్ ఆమోదం కోసం పంపారు, ఆ బిల్లులను తిరస్కరించాలని టిడిపి...

రాజస్థాన్ ప్రభుత్వ సంక్షోభం: సచిన్ పైలట్ కు భారతీయ జనతా పార్టీ కండువా

రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ను పార్టీలోకి ఆహ్వానించాలని బిజెపి చూస్తుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను ఒక హోటల్లో "బందీగా" ఉంచినందుకు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై...