Wednesday, July 8, 2020
Home Tech News భారతీయ 'చింగారి' యాప్ 2.5 మిలియన్ డౌన్ లోడ్లు సాక్షిగా వునికి కోల్పోనున్న టిక్ టాక్.

భారతీయ ‘చింగారి’ యాప్ 2.5 మిలియన్ డౌన్ లోడ్లు సాక్షిగా వునికి కోల్పోనున్న టిక్ టాక్.

డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రపంచంలోకి ఇండియన్ యాప్ చింగారీ ని ప్రారంభించిన వెంటనే చైనీస్ యాప్ టిక్ టాక్ భారతీయ మార్కెట్లో తన స్థానాన్ని కోల్పోయింది.

‘బాయ్ కాట్ చైనీస్ యాప్స్’ నినాదాల మధ్య, చింగారి యాప్ ను ఛత్తీస్ గఢ్ మరియు కర్ణాటకకు చెందిన ఐటి ప్రొఫెషనల్ మరియు ఒడిషా మరియు కర్ణాటకకు చెందిన డెవలపర్లు అభివృద్ధి చేశారు.టిక్ టాక్ కు బదులుగా ఈ దేశీ యాప్ చింగారిని డెవలప్ చేశారు. దాదాపు 2.5 మిలియన్ డౌన్ లోడ్లతో భారీ ప్రజాదరణ ను పొందుతోంది.

స్టీల్ సిటీ భిలాయ్ కు చెందిన చింగారి యాప్ యొక్క చీఫ్ ప్రొడక్ట్ సుమిత్ ఘోష్, ఈ మొబైల్ అప్లికేషన్ ని అభివృద్ధి చేయడానికి సుమారు రెండు సంవత్సరాల సమయం పట్టిందని చెప్పారు. భారతీయ వినియోగదారుల అవసరాలు, డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని యాప్ అభివృద్ధి చేయబడింది. గూగుల్ ప్లే స్టోర్ లో రెండేళ్ల క్రితం 2018 నవంబర్ లో ఈ యాప్ ను అధికారికంగా విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా చైనా వస్తువులు, యాప్ లు బహిష్కరించాలనే పిలుపులతో, అత్యంత ప్రజాదరణ పొందిన టిక్ టోక్ ను పోలిఉన్న చింగారి యాప్ దేశవ్యాప్తంగా యూజర్లలో వైరల్ అవుతోంది. “మేము భారతీయ వినియోగదారుల నుండి అద్భుతమైన ప్రతిస్పందనను పొందుతున్నాము. ఇటీవలి గణాంకాలు ప్రకారం, యాప్ కు 25 లక్షల పైనే డౌన్ లోడ్ లు ఉన్నాయి”, అని ఘోష్ అన్నారు.

ఒడిశాకు చెందిన బిశ్వత్మా నాయక్, కర్ణాటకకు చెందిన సిద్ధార్థ్ గౌతమ్ అనే డెవలపర్ ఈ మొబైల్ అప్లికేషన్ ను అభివృద్ధి చేశారు. “ఇది భారతదేశంలో అభివృద్ధి చేయబడ్డ ఏకైక సోషల్ అప్లికేషన్, ఇది TikTok యాప్ కు పూర్తి ప్రత్యర్థి. ఈ యాప్ ప్రాంతీయ భాషల్లో ఒడియా, గుజరాతీ, మరియు మరాఠీ వంటి ప్రాంతీయ భాషలతో సహా అనేక భాషల్లో కూడా లభ్యం అవుతుంది, అని ఘోష్ అన్నారు.

ట్రెండింగ్ న్యూస్, ఎంటర్ టైన్ మెంట్ న్యూస్, ఫన్నీ వీడియోలు, వీడియో సాంగ్స్,లవ్ కోట్స్, వాట్సప్ కోసం స్టేటస్ వీడియోలు వంటి ఫీచర్లు చింగారి లో ఉన్నాయి. ఇప్పటి వరకు, 10,000 మంది యూజర్లు ఈ ప్లాట్ ఫారమ్ ను రోజువారీగా ఉపయోగించి వినోదాత్మక కంటెంట్ ను రూపొందిస్తున్నారు. యాప్ యూజర్ లు వివిధ రకాల వినోదాత్మక మరియు సమాచారాత్మక చిన్న వీడియోలను బ్రౌజ్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది మరియు వాటిని డౌన్ లోడ్ చేసుకోవడానికి, లైక్ చేయడం కొరకు, స్నేహితులు మరియు కుటుంబంతో పంచుకోవడానికి కూడా ఆప్షన్ లను అందిస్తుంది. అంతేకాకుండా, ఇది వినియోగదారులు సృజనాత్మకంగా ఉండడాన్ని కూడా అనుమతిస్తుంది, తద్వారా వారు ఈ ప్లాట్ ఫారమ్ ద్వారా వినోదాత్మక వీడియోలతో ముందుకు రాగలరు.

Most Popular

భారతదేశం 24,248 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 425 మరణాలు, మొత్తం 7 లక్షలకు దగ్గరల్లో ఉన్న కోవిడ్ కేసులు.

సోమవారం భారత్ లో గడిచిన 24 గంటల్లో 24,248 కొత్త కోవిడ్ 19 కేసులు మరియు 425 మరణాలు నమోదయ్యాయి. దేశంలో పాజిటివ్ కేసులు 6,97,413 గా ఉన్నాయి, వీటిలో 2,53,287 క్రియాశీల...

ఢిల్లీ నుంచి పలు నగరాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించనున్న రైల్వేశాఖ.

ఢిల్లీ నుంచి మరికొన్ని నగరాలకు అదనంగా 40 జతల ప్రత్యేక రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర హోంశాఖకు రైల్వే మంత్రిత్వ శాఖ పంపినట్లు తెలుస్తోంది....

PM శర్మ ఓలి భవిష్యత్తుని నిర్ణయించే నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం మళ్ళీ వాయిదా

ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి భవిష్యత్తును నిర్ణయించే నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కీలకమైన స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారానికి వాయిదా పడింది అని అధికారిక ప్రకటన తెలిపింది. ఈ సమావేశం బుధవారానికి...

కొత్త ప్రవాస బిల్లు వలన 8 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశం విడిచి పెట్ట వలసి వస్తుంది

కువైట్ యొక్క జాతీయ అసెంబ్లీ యొక్క చట్టపరమైన మరియు శాసనసభ కమిటీ విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించే ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది, ఈ చట్టాన్ని అమలు చేయటంవల్ల కనీసం...