Thursday, September 24, 2020
Home World News కుప్పకూలిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం.. స్పందించిన పీఎం మోది

కుప్పకూలిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం.. స్పందించిన పీఎం మోది

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచీ విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం విమానం ల్యాండింగ్ అవడానికి ఒక్క నిమిషం ముందు జనావాసాలపై కూలిపోయింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రయాణికులతో లాహోర్ నుంచి కరాచీకి వస్తుండగాఈ దుర్ఘటన చోటు చేసుకుంది.కరాచీ విమానాశ్రయానికి 4 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. జనావాసాల మధ్య ఈ విమానం కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలోకూడా చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విమాన ప్రమాదంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రంజాన్‌ వేడుకలకు దేశమంతా సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో కరాచీలో విషాద ఛాయలు అలుము కున్నాయి.
ఈ ఘటన పై ప్రధాని నరేంద్ర మోది స్పందిస్తూ ఇది తనకు చాల బాధ కలిగించింది అని తెలిపారు.

Most Popular

చైనా సరిహద్దు నిఘాకి ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోని అత్యంత చురుకైన, నిఘా డ్రోన్ను అందించిన DRDO.

భారతదేశం మరియు చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం మధ్య, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఎత్తైన ప్రదేశాలు మరియు పర్వత భూభాగాలపై...

కరోనా ప్రభావం: కోవిడ్ సేఫ్ దేశాలలో ఫ్యూచర్స్ ప్లాన్ చేస్తున్న ప్రపంచం బిలియనీర్స్…

లాక్డౌన్ తర్వాత ప్రపంచ ధనవంతులు చేయబడినప్పుడు, వారు తమ రిమోట్ మరియు ఎండ బీచ్కు తప్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలనుకొంటున్నారు. లేదా బహుశా న్యూజిలాండ్ లో కోవిడ్ -19 ను తొలగించిన కొద్ది...

‘AP పీపుల్ ఆమోదం పొందిన జగన్ 3 రాజధానులు’

ఎపిలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులపై నిందలు వేస్తూ సిఆర్డిఎను రద్దు చేస్తున్నాయి. గత శనివారం ఈ బిల్లులను ఎపి గవర్నర్ ఆమోదం కోసం పంపారు, ఆ బిల్లులను తిరస్కరించాలని టిడిపి...

రాజస్థాన్ ప్రభుత్వ సంక్షోభం: సచిన్ పైలట్ కు భారతీయ జనతా పార్టీ కండువా

రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ను పార్టీలోకి ఆహ్వానించాలని బిజెపి చూస్తుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను ఒక హోటల్లో "బందీగా" ఉంచినందుకు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై...