Wednesday, June 3, 2020
Home News సీఎం కేసీఆర్‌: లాక్‌డౌన్ పొడిగింపు‌ సందర్భంగా ముఖ్యంశాలు

సీఎం కేసీఆర్‌: లాక్‌డౌన్ పొడిగింపు‌ సందర్భంగా ముఖ్యంశాలు

తెలంగాణలో లాక్ ‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ రోజు మార్గదర్శకాలను విడుదల చేశారు.

తెలంగాణలో అనుమతించ బడినవి:

  • రేపు ఉదయం నుంచే ఆర్టీసి బస్సులు తిరుగుతాయి.
  • హైదరాబాద్‌లో సిటీ బస్సులకు, అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతి లేదు.
  • ఆటోలో డ్రైవర్ మరియు ఇద్దరు ప్రయాణికులకు అనుమతి.
  • ట్యాక్సీలు డ్రైవర్ మరియు ముగ్గురు ప్రయాణికులకు అనుమతి.
  • కంటైన్‌మెంట్‌ మినహా అన్ని చోట్లా సెలూన్లు తెరుచుకోవచ్చు.
  • హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలో అన్ని చోట్లా అన్ని షాపులూ తెరుచుకోవచ్చు.
  • హైదరాబాద్‌లో కంటైన్‌మెంట్‌ మినహా సరి-భేసి విధానంలో షాపులూ తెరుచుకోవచ్చు .
  • ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పనిచేసుకోవచ్చు.
  • పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మానుఫాక్చరింగ్‌ యూనిట్లు పనిచేసుకోవచ్చు.
  • ఈ కామర్స్‌ వ్యాపార కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో అనుమతి.

తెలంగాణలో నిషేదిహించ బడినవి:

  • ప్రార్థనా మందిరాలు, ఆలయాల్లోకి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌కూడ‌దు.
  • ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ బంద్.
  • సభలు, ర్యాలీలు బంద్.
  • బార్లు, పబ్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, పార్కులు, స్టేడియంలు, అమ్యూజ్మెంట్ పార్కులు బంద్.
  • మెట్రో రైళ్లు కూడా నడవవు.
  • స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లకు మే 31 వరకు అనుమతి లేదు.

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి తీరాల్సిందే. లేదంటే వెయ్యి రూపాయల ఫైన్ తప్పదు. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.

65 ఏళ్లు దాటిన వృద్ధులు, చిన్న పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు అని తెలిపారు.

మే 31 వరకు రాష్ట్రంలో రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది అని కేసీఆర్‌ స్పష్టంచేశారు.

Most Popular

రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చట్టం: కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వస్తువుల చట్టాన్ని సవరించిన కేంద్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం బుధవారం (జూన్ 3) వ్యవసాయానికి సంబంధించిన మూడు నిర్ణయాలతో సహా...

కేసీఆర్ కాన్వాయ్ పై చలాన్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్

సాధారణ సంఘటనలో, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలంగాణ సిఎం కెసిఆర్ కాన్వాయ్ వేగ పరిమితికి మించి పోవడంతో చలాన్ విధించారు. చలాన్ల వివరాలను లోతుగా పరిశీలిస్తే, ట్రాఫిక్ పోలీసులు CM యొక్క కాన్వాయ్‌లోని...

పుల్వమాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు తీవ్ర వాదులు మృతి

దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో ఐఇడి నిపుణుడితో సహా ముగ్గురు జైష్-ఎ-ముహమ్మద్ ఉగ్రవాదులు చంప బడ్డారు. దాక్కున్న ఉగ్రవాదులతో ఉదయం సంప్రదింపులు జరిగాయని, వారు లొంగిపోయేలా ప్రకటనలు చేసినట్లు ఆర్మీ...