Wednesday, May 27, 2020
Home World News అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం కోట్లలో దరఖాస్తులు

అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం కోట్లలో దరఖాస్తులు

అమెరికాలో కరోనా మహమ్మారి ఊహించని రీతిలో వ్యాపిస్తున్న తరుణంలో అదే స్థాయిలో నిరుద్యోగులు కూడా పెరుగుతున్నారు. వరుసగా తొమ్మిదో వారం నిరుద్యోగ భృతి కోసం కొన్ని కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తుండడంతో నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించటానికి కంపెనీలు తమ ఉద్యోగులను ఎక్కువ మొత్తంలో తగ్గిస్తున్నాయి. ఫలితంగా రోడ్డున పడ్డ కోట్ల మంది ఉద్యోగులు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని లేబర్ డిపార్ట్‌మెంట్ గురువారం ప్రకటించింది. ఇక కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి మధ్యలో నుంచి ఇప్పటి వరకు మొత్తం 3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. అమెరికాలో ఉద్యోగుల తప్పు లేకుండా వారిని ఉద్యోగం నుంచి తీసేస్తే, ప్రభుత్వం వారికి ప్రతి వారం నిరుద్యోగ భృతి చెల్లిస్తుంది.

Most Popular

PM మోడీ ‘డోక్లాం బృందం’ను అన్నివిధాలుగా సిద్దం చేశారు.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) దూకుడును ఎదుర్కోవటానికి భారతదేశం తూర్పు లడఖ్ సరిహద్దుల వెంట పెద్దఎత్తున యుద్ధ దళాలను మోహరించింది. అక్సాయ్ చిన్ లోని లాసా-కష్గర్ హైవే. చైనాలోని...

నిషాబ్ధం సినిమా ఆకస్మికంగా సెన్సార్ పూర్తి

అనుష్క శెట్టి ప్రధాన పాత్ర లో నటించిన నిషబ్ధం సినిమా OTT ప్లాట్‌ఫాంలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని చాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి...

భారత్ లో COVID-19 కేసులు 1.5 లక్షలు దాటి, మరణాల సంఖ్య 4,337 గా ఉంది

దేశం లో కరోనా మహామ్మారి ఇంతకు ఇంత విజ్రంబిస్తుంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,51,767 కేసులు నమోదు కాగా 4,337 మంది మరణించారు...

“ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండండి”: చైనీస్ మిలిటరీకి జి జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మిలిటరీ ని సిద్దం గా ఉండలి అని ఆదేశించారు, ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండలి అని ఆయన అన్నారు....